Friday, September 24, 2010

జపమునకు ఆసన ప్రాధాన్యత


కంబళి


జపం లేదా పూజ చేసేటప్పుడు ఆసనం వేసుకుని దానిపై కూర్చుని చేయాలి. ఆ ఆసనం గురించి కొంత తెలుసుకోవడం ఉత్తమం. దర్భాసనము వేసుకుని, దానిపై తెల్లని వస్త్రం వేసుకుని జపం చేయడం ఉత్తమం. కొందరు క్రమంగా దర్భాసనం, కంబళి, వస్త్రం వేసుకుని జపం చేస్తారు.

కేవలం పీట వేసుకుని జపం చేయడం మంచిది కాదు. "దరిద్రం దారుకాసనం" అన్నారు. పీటపై వస్త్రం వేసుకుని చేసుకోవాలి. పీట ౯ అంగుళాల ఎత్తులో చేయించుకుంటే మంచిది అంటారు. అలా చేయడం వలన భూమ్యాకర్షణ శక్తికి లొంగక మన మనస్సు భగవంతునిపై లగ్నమవుతుంది.
దర్భాసనం


యోగులు దర్భాసనం వేసుకుని, దానిపై కృష్ణాజినం (జింకచర్మం) మరల దానిపై తెల్లని వస్త్రం వేసుకుని జపం చేసుకునేవారు.

మీరు కూడా కృష్ణాజినం ప్రయత్నించేరు సుమా! ఆ పని మాత్రం చేయకండి. మన జపం చిన్న జీవికి కూడా హాని కలింగించ కూడదు. అలా జరిగిన నాడు ఆ జపం నిష్ఫలం.

ఇక ఆసనం గురించి మీకు తెలిసిన విషయాలు కూడా చెప్పండి మరి.

Wednesday, September 22, 2010

సాధకుడన్


నేను గాయత్రీ సాధకుడను.అంటే గాయత్రీ జంపం చేయాలని సంకల్పించాను. ఆ జంపం ఎలా చేయాలి? ఏం ఏం నియమాలు పఠించాలి? మొదలైన విషయాలు నేను తెలుసుకుంటూ నలుగురికీ కూడా తెలియజేయాలని ఈ చిన్న ప్రయత్నం.  నా సాధనా విధి విధానాలను నలుగురితో పంచుకుంటూ, తోటి సాధకుల సహాయ సహకారాలతో నా సాధనను మరింత పెంచుకోవడానికి ఈ బ్లాగు ఉపకరిస్తుందని ఆశిస్తున్నాను. నా సాధనా విషయాలు మరికొందరికి ఉపకరిస్తే మరింత సంతోషం. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఆ అమ్మదయ అందరికీ కలగాలని మనసారా కోరుకుంటున్నాను.